నన్ను కరుణించవా చెలీ?


తెల్లవారే పువ్వు మీద తొలిమంచు నా కోసమే ముత్యమై మెరుస్తుంది

వికసించిన పువ్వు నాకెప్పుడూ వినోదాన్ని,ఆనందాన్ని పంచుతుంది

ప్రచండ వేడిమి గల సూర్యుడు సైతం నన్ను చూసాకే పశ్చిమ కనుల్లోకి వెళ్లిపోతాడు



చందమామ సైతం నాకోసం వెన్నెలను విరబూస్తూనే వుంటుంది

నదుల గలగలలు,సముద్రాల ఘోషతరంగాలు నాకెప్పుడూ సంతోషాన్నే మిగిల్చాయి.

కానీ...కానీ...ప్రకృతి నంతటినీ సింగారించుకున్న నీవు మాత్రం 
నన్ను ఏనాడూ ఓదార్చలేదు.

నా ఆవేదనను అర్ధం చేసుకుని ఆహ్లాదాన్నే ఇవ్వలేదు.

నా ఆలోచనలకు ప్రతిరూపం ఏనాడూ ప్రసాదించలేదు.

నేను మాత్రమే బాధపడడం లేదు చెలీ.....

నీవు సింగారించుకున్న ప్రకృతి సైతం మూగగా రోదిస్తూనే వుంది. 

---------------------------------------------------------------------------------------------------
                  Please visit : http://ahmedchowdary.blogspot.in/

No comments:

Post a Comment