మీలో ఈ గుణాలుంటే ?

జీవితం అనేక సమస్యలతో నిండిపోయినప్పుడు బ్రతకడమే ఒక సమస్యగా మారిపోతుంది.ఎవరూ కూడా ఇటువంటి పరిస్తితి రాకుండానే జాగ్రత్తపడాలి.దీనికి గమ్యనిర్దేశ్యం,ప్రణాలిక, సమయనిబద్ధత,తెగింపు, క్రమశిక్షణ అవసరం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే జీవితమనేది నందనవనంగా తయారవుతుంది. ఒకవేళ అనుకోని రీతిలో సమస్యలు వచ్చినా ఎదురుతిరిగి పోరాడే ధైర్యం,పరిష్కరించుకునే చాకచక్యం,నేర్పరితనం అన్నీ సమకూరుతాయి.
తెలివైన జ్ఞాని భవిష్యత్ ని నందనవనంగా చేసుకోవడానికి కొన్ని త్యాగాలు చేస్తాడు.
తెలివైన మూర్ఖుడు భవిష్యత్ ని మూడడుగులకంటే ఎక్కువ ఊహించక సర్వనాశనమవుతాడు.

          నేను ఒకసారి బసులో ప్రయాణం చేస్తునప్పుడు పక్క సీట్లో ఒక వ్యక్తి [బహుశా 35సం//] కూర్చున్నాడు.బస్సు బయలుదేరిన 5నిమిషాల తరువాత ఒకరికొకరం పరిచయం పెంచుకున్నాం.తను యం.బి.బి.యస్ డాక్టర్ గా పనిచేస్తున్నాడట.తనీ పరిస్తితికొచ్చి ఎంతో ఆనందం,తృప్తి పొందుతున్నానని చెప్పాడు.తను చెప్పిన కొన్ని విషయాలు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి.ఆనందానిచ్చే పెద్ద లక్ష్యం పూర్తి కావాలంటే సంతోషానిచ్చే చిన్న,చిన్న పనులు త్యాగం చెయ్యాలి సర్ అన్నాడు.
     "నా టార్గట్ డాక్టరవ్వడం అదే నా పెద్ద గోల్!దానిని పొందడం కోసం చదువుకునే రోజుల్లో సినిమాలు మానేసాను.షికార్లు మానేసాను.ఫ్రెండ్స్ తో పనికిరాని మాటలు మానేసాను.ప్రేమించడానికి అందమైన అమ్మాయి కావాలి.మనకు నచ్చాలి.చదువుకునే రోజుల్లో ట్రై చేస్తే దక్కించుకోవడం బహు కష్టం.లవ్ లో పడితే లైఫ్ సర్వనాశనమవుతుంది.అందుకనే దానికి దూరంగా ఉన్నాను.నేను నా గోల్ సాధించిన తరువాత నా పెళ్లికొచ్చిన అమ్మాయిల ఫొటోలను చూసి ఏది సెలక్ట్ చేసుకోవాలో తెలియని అయోమయం పడ్డానంటే నమ్మండి.అదే చదువుకునే రోజుల్లో ప్రేమా,దోమా అని వుంటే నాకు జాగీ కూడా లేకుండా పోదును.నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ప్రేమలో పడి చదువు అటకెక్కించి చిన్న,చిన్న వృత్తులో బ్రతుకును ఈడుస్తూ జీవిస్తున్నారు.నేనుకూడా వారిలాగే ఎటువంటి లక్ష్యం లేకుండా జీవించి ఉంటే నాగతి కూడా అదే అయ్యుండును.కానీ నేను జాగ్రత్తపడ్డాను."జ్యూస్ త్రాగి ఆనందం [ఆరోగ్యం] పొందాలంటే, ప్రతిరోజూ టీలు,కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చంపుకోవాలి" పెద్ద,పెద్ద ఆనందాలను సాధించడం కోసం చిన్న,చిన్న సంతోషాలు త్యాగం చేయడమే ప్రణాలిక.ఇది సాధించిన తరువాత పొందేదే జీవితం సర్."
        అతని మాటలు కొద్దిగా అర్ధం కాకపోయినా ఆలోచిస్తే మాత్రం జీవిత సత్యమే బోధపడుతుంది.మనం గమ్యరహితంగా జీవిచడం ప్రారంభించడం అంటే మన నాశనాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటున్నట్టు లెక్క.కాబట్టి మనిషి గమ్యం నిర్దేశించుకోవాలి.ఆనందానికి అవధులను,అవాంతరాలను దూరం చేసుకోవాలి.ముఖ్యంగా దానికి కావాల్సిన సామాగ్రి-5 రకాలు.
                              మెదటిది : గమ్యనిర్దేశ్యం
                              రెండవది : ప్రణాలిక
                           మూడవది : సమయనిబద్ధత
                              నాల్గవది : తెగింపు [పట్టుదల]
                               ఐదవది : క్రమశిక్షణ

         పై 5 గుణాలు మీలో పుష్కలంగా ఉంటే మీరు విజయం సాధించినట్లే! ఆనందానికి దారులు వేసుకున్నట్టే! ప్రయాణం చేసి విజయమనే గమ్యాన్ని చేరుకోవడమొక్కటే తరువాయి.ఆల్ ది బెస్ట్.
పై ఆర్టికల్ www.ahmedchowdary.blogspot.in నుండి సేకరించినది 
________________________________________________

1 comment:

  1. మీరు చెప్పిన 5 గుణాలు అలవరచు కోవాలంటే, పిల్లలకి అందరికీ సాద్యం కాకపోవచ్చు. ముఖ్యంగా చిన్నవయస్సులో ఏది మంచో ఏది చెడొ తెలీదు. ఇకపోతే క్రమశిక్షణతో పెంచే తల్లిదండ్రులు ఉండాలి.
    మీరు అవున్నన్నా కాదన్నా, అన్నిటి కన్నా ముఖ్యం డబ్బు ఉండాలి.
    అఫ్కోర్స్ నిగ్రహం అవసరమే.
    ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి వక్కరూ చెప్పేది తాము పడ్డ శ్రమనే, తమ వెనుక ఉన్న స్థితిని కాదు. మన్నించాలి విమర్శించటం నా అభిమతం కాదు.

    ReplyDelete